బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఫేమ్ ఆటోమేటిక్ గా వస్తుంది..తెలుగులో బిగ్ బాస్ 6 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే..ఇంటర్వ్యూలతో యాంకర్ గా చేస్తున్న ఇనయా ఆర్జీవీ తో డాన్స్ చేసిన ఒకే ఒక వీడియోతో ఫేమస్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు తన ఆటతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న ఇనాయ ఇటీవలే చివరి కెప్టెన్ అయ్యి సెమీ ఫైనల్ లో ప్లేస్ సంపాదించుకుంది. అలాగే ఈ అమ్మడు అర్జీవిని ఇంటర్వ్యూ చేయడం.. ఆ తర్వాత ఆయనతో కలిసి బర్త్ డే పార్టీలో డాన్స్ చేయడంతో ఓవర్ నైట్ లో హాట్ టాపిక్ గా మారింది.


ఇక ఇనయా గురించి తెలియని వాళ్ళు ఇప్పుడు ఈ అమ్మడి వివరాలను గూగుల్ ను అడిగి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్ కు వెళ్ళాక ముందు ఇనాయ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆర్జీవి మంచి డైరెక్టర్, ఆయన గొప్ప వ్యక్తి అని  నా బర్త్ డే పార్టీకి ఆయన వచ్చాడు.. ఆ తర్వాత మ్యూజిక్ కి డాన్స్ చేశాం అంతే ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది..? ఎవరు తీశారు అన్నది తనకు తెలియదు అని తెలిపింది. ఇక ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత తన ఫ్యామిలీ తనను అసహ్యించుకుందని.. తనను చాలా మంది తప్పుగా చూస్తున్నారని ఎమోషనల్ అయ్యింది.


ఇండస్ట్రీలోకి రావాలని ఇంటినుంచి పారిపోయి వచ్చిన ఇనాయ కూడా క్యాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నాని చెప్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని నేను చెప్పను.. కానీ ఇష్టం లేకుండా ఏ పనీ చేయలేం. అందుకే నాకు చాలా ఆఫర్లు వచ్చినా నేను చేయలేదు అని తెలిపింది. అక్కడ నేను ఒప్పుకుంటే.. ఈపాటికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేదాన్ని. కానీ నేను అలా చేయలేదు అని చెప్పుకొచ్చింది. ఇక చాలా మంది ఇండస్ట్రీ అంటేనే కమిట్‌మెంట్ అని అనుకుంటూఉంటారు.. అది లేకుండా కూడా ఇండస్ట్రీలో ఉండొచ్చని నేను ప్రూవ్ చేస్తా.. అని తెలిపింది..ఆ తర్వాత ఎలాంటి ఆఫర్లను అందుకుంటుందో తెలియాల్సి ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: