ఎన్నో రోజుల నుంచి అటు బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ వచ్చిన బిగ్ బాస్ ఆరవ సీజన్ ఇక ఇప్పుడు చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం టికెట్ టు ఫినాలే పోటీలు జరుగుతున్నాయి. అయితే గత సీజన్ లాగా.. ఈ సీజన్ పెద్దగా ఆసక్తికరంగా జరగకపోయినప్పటికీ ఇక అప్పుడప్పుడు బిగ్ బాస్ కాస్త కొత్త టాస్కులు ఇచ్చి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు అని చెప్పాలీ. అయినప్పటికీ ఇక బిగ్ బాస్ టిఆర్పి రేటింగ్ మాత్రం పడిపోయింది అని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి.


 ఇదిలా ఉంటే సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ ఎవరైనా సరే అటు బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కంటెస్టెంట్ బిగ్ బాస్ ఆదేశాలను పాటించలేదు అంటే.. ఇక వారికి పనిష్మెంట్ ఇవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది   అందుకే ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరూ కూడా బిగ్ బాస్ ఆదేశాలను మీరటానికి పెద్దగా ధైర్యం చేయరు. కానీ ఇటీవలే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మాత్రం ఏకంగా కంటెస్టెంట్స్ అందరిలో విరక్తి పుట్టించింది.


 ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్టు ఫినాలే పోటీలు జరుగుతూ ఉండగా.. ఈ పోటీలలో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా  పట్టుదలతో ఆడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ ఒక సందేశాన్ని పంపించాడు. టికెట్టు ఫినాలే రేసులో కంటెస్టెంట్లు ఇక నలుగురిని.. పోటీ పడుతున్న వారే ఏకాభిప్రాయం ప్రకారం ఎంచుకోవాలి అంటూ ఒక ఫిట్టింగ్ పెట్టాడు. ఇంత కష్టపడ్డాక ఏకాభిప్రాయం ఏంటి బిగ్ బాస్ అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఏకంగా బిగ్ బాస్ పై ధ్వజమెత్తారు. ఒకవేళ ఏకాభిప్రాయం ప్రకారం తాము లిస్టులో లేకపోతే ఇప్పటివరకు తాము పడిన కష్టం మొత్తం బూడిలో పోసిన పన్నీరు అవుతుందని ఆవేదన చెందారు. ఇక అందరూ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ ఫిట్టింగ్ పై అసహనం వ్యక్తం చేశారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా శ్రీహాన్ అయితే బిగ్ బాస్కే వార్నింగ్ ఇచ్చాడు. నేను తప్పకుండా ఫినాలే కి వెళ్లాలనుకుంటున్నాను. అది నాకు ఎంతో అవసరం. ఇలా ఏకాభిప్రాయం ఫిట్టింగ్ నాకు అస్సలు నచ్చలేదు.  ఒకవేళ ఏకాభిప్రాయం ప్రకారం నేను ఫినాలేకు వెళ్లకపోతే ఇక్కడున్న ప్లేట్లు అన్ని పగిలిపోతాయి. ఒక్కడిని కూడా గెలవనివ్వను అంటూ బిగ్ బాస్ కే వార్నింగ్ ఇచ్చాడు శ్రీహాన్. ఇక ఇది చూసిన ప్రేక్షకులు బిగ్ బాస్కే వార్నింగా.. నీ ధైర్యం ఏంటి సామీ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: