కళ్ళు తిప్పుకోలేని గ్లామర్ ఉన్నప్పటికీ కూడా కేతిక శర్మకు కాలం అయితే కలిసి రావడం లేదు.

లైఫ్ ఇచ్చే ఒక్క హిట్ కూడా పడటం లేదు. హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసిన కేతిక… ఐరన్ లెగ్ ట్యాగ్ ను అయితే సొంతం చేసుకుంది. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన కేతిక 'రొమాంటిక్' మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. దర్శకుడు పూరి జగన్నాధ్ నిర్మాతగా ఆయన అబ్బాయి ఆకాష్ పూరి హీరోగా 'రొమాంటిక్' తెరకెక్కింది. ఫస్ట్ సినిమాలోనే పెద్ద సాహసానికి అయితే ఒడిగట్టింది.


రొమాంటిక్ మూవీలో కేతిక-ఆకాష్ రొమాన్స్, కెమిస్ట్రీ బౌండరీలు అయితే బ్రేక్ చేసింది. ఈ మధ్య కాలంలో ఏ కుర్ర హీరో ఆ రేంజ్ ఇంటిమసీ సన్నివేశాల్లో నటించలేదు. దర్శకుడు అనిల్ పాదూరి తెరకెక్కించిన రొమాంటిక్ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా నిరాశపరిచింది. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో మరో డిజాస్టర్ అయితే అయ్యింది.


కేతిక ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్ష్య సినిమా కూడా అదే ఫలితాన్ని ఇచ్చింది. లక్ష్య మూవీ విషయంలో నాగ శౌర్య శ్రమ గురించి చెప్పుకోవాల్సిందే. పాత్ర కోసం ఎంతో కష్టపడి సిక్స్ ప్యాక్ సాధించాడు. పూర్తిగా మేక్ ఓవర్ కూడా అయ్యాడు. నాగ శౌర్య కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. మూవీలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు పట్టించుకోలేదు. కేతిక కెరీర్లో సెకండ్ డిజాస్టర్ గా ఆ లక్ష్య నిలిచింది.


కేతిక నటించిన మూడో చిత్రం రంగ రంగ వైభవంగా. ఈ మూవీ గురించి చెప్పుకోక పోవడమే ఎంతో మంచిది. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా కూడా డబుల్ డిజాస్టర్ అయ్యింది. రెండో రోజే థియేటర్స్ నుండి ఎత్తేసే పరిస్థితి. నటించిన మూడు చిత్రాల్లో కనీసం ఒకటి కూడా మోస్తరు విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. కేతిక కెరీర్ ప్రమాదంలో పడిపోయింది.

ప్రస్తుతం కేతిక చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. అయితే తన సాలిడ్ గ్లామర్ తో దర్శక నిర్మాతలకు వల వేసే ప్రయత్నం అయితే చేస్తుంది. కేతిక హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ కాకరేపుతున్నాయి. వరుస ఫోటో షూట్స్ తో ఆమె సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. తాజాగా కేతిక ట్రెండీ వేర్ లో టెంప్టింగ్ ఫోజులతో మంట రేపారు. కేతిక ఫోటో షూట్ వైరల్ అవుతుండగా… ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంస్టాగ్రామ్ లో కేతిక శర్మను రెండు మిలియన్స్ పైగా నే ఫాలో అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: