సాధారణంగా ఒక సినిమా ఒక భాషలో విడుదలవుతోంది అంటే ఆ సినిమాను అన్ని భాషలలో విడుదల చేస్తూ పాన్ ఇండియా సినిమాగా ధ్రువీకరించాలని దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో వరుస సినిమాలు ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా పోటీపడుతున్న నేపథ్యంలో తమిళ చిత్రాల విడుదల తెలుగు చిత్రాలకు ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా బాలకృష్ణ వీరసింహారెడ్డి , చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు కూడా కష్టాలు తప్పడం లేదు అన్నట్లుగా తెలుస్తోంది.

తెలుగులో వీరిద్దరూ కూడా స్టార్ సీనియర్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న వారే.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న వీరిద్దరి సినిమాలకు ప్రస్తుతం థియేటర్లు దొరకడం లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రముఖ నిర్మాత శ్రీ వెంకటేశ్వర మూవీస్ బ్యానర్ అధినేత దిల్ రాజు కోలీవుడ్ హీరో విజయ్ దళపతి తో వారసుడు సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమాని కూడా సంక్రాంతి బడిలో పోటీకి దింపుతున్నాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే బాలకృష్ణ , చిరంజీవి సినిమాల కంటే కోలీవుడ్ హీరో వారసుడు సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ థియేటర్లు కల్పించడం జరిగింది.

ఇప్పుడు మరికొన్నిచోట్ల జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే టాలీవుడ్ లోనే టాలీవుడ్ హీరోలకు ఇమేజ్ క్రమంగా తగ్గిపోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి .. అసలు విషయంలోకి వెళితే చాలామంది చిరంజీవి , బాలకృష్ణ సినిమాల కంటే వారసుడు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు కూడా వారసుడు సినిమాను ప్రదర్శించడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం గమనార్హం.  దీన్ని బట్టి చూస్తే బాలకృష్ణ,  చిరంజీవి సినిమాలకు థియేటర్లు చాలా తక్కువగా దొరికాయి. మరి ఏ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తాయో అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మరొకవైపు కొంతమంది వ్యక్తుల వల్ల తెలుగులో తెలుగు వాళ్లకే గుర్తింపు లభించడం కష్టంగా మారింది అంటూ రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: