‘కార్తికేయ 2’ విడుదల అయిన తరువాత నిఖిల్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగి పోవడంతో ఈ యంగ్ హీరో తన పారితోషికాన్ని 10 కోట్ల స్థాయికి పెంచడమే కాకుండా తన సినిమాలను భారీ నిర్మాణ సంస్థలు నిర్మిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’18 పేజేస్’ ఈ నెల 23న క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదల చేయబోతున్నారు.


సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయింది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉన్నా రకరకాల కారణాలతో ఈ మూవీ విడుదలను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తున్నారు అని వస్తున్న వార్తలు విని చాలామంది ఆశ్చర్య పడుతున్నారు.


ఒకవైపు రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న పరిస్థితులలో ఈసినిమా పాటలను విడుదల చేసి ఈసినిమా పై క్రేజ్ పెంచవలసిన పరిస్థితులలో ఈమూవీకి ఇప్పుడు రీ షూటింగ్ ఏమిటి అంటూ కొందరు షాక్ అవుతున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ‘కార్తికేయ 2’ తరువాత నిఖిల్ ఇమేజ్ లో మార్పులు వచ్చిన పరిస్థితులలో ఈ మూవీ కథలో మార్పులు చేసి రీ షూట్ చేస్తున్నారని టాక్. వాస్తవానికి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వచ్చే సినిమాలు అన్నీ చాల సహజంగా ఉంటాయి.


ఇప్పుడు ఆ ట్రాక్ ను పక్కకు పెట్టి ఈమూవీని ఒక యూత్ ఫుల్ మూవీలా కాకుండా కొత్తగా ఏర్పడిన నిఖిల్ హీరో ఇమేజ్ కోసం మార్పులు చేస్తే అసులుకు మోసం వస్తుందేమో అంటూ ఈమూవీని ఇప్పటికే కొనుక్కున్న బయ్యర్లు భయపడుతున్నట్లు టాక్. ‘అవతార్ 2’ మ్యానియాను కూడ లెక్కచేయకుండా ఏకంగా మాస్ మహారాజా ‘ఢమాక’ తో పోటీ పడుతున్న ఈమూవీ విజయం నిఖిల్ కెరియర్ కు అత్యంత కీలకం..
మరింత సమాచారం తెలుసుకోండి: