టాలీవుడ్ హీర్ శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా  పరిచయం అయింది శ్రీ లీల. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ద్వారా తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ .మొదటి సినిమాతోనే వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది శ్రీ లీల. అయితే ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో ఈమెకి వార్నింగ్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ముందుగా కన్నడ ఇండస్ట్రీలో కిస్ ,భారత్ అనే సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పెళ్లి సందడి సినిమా ద్వారా పరిచయమైంది.

అయితే ప్రస్తుతం ఈమె చేతిలో దాదాపు నాలుగు , ఐదు ప్రాజెక్ట్ లు  ఉన్నాయి .రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది .వరుస  ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ భామకి ఓ స్టార్ హీరో కూడా తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని ఆమెకి చెప్పగా ఆ సినిమాలో స్టార్ హీరో ఉండడంతో ఒప్పుకుందట .ఒప్పుకున్నానంతరం కాల్ షీట్స్   అడ్జస్ట్ కాకపోవడంతో నేరుగా డైరెక్టర్ కి ఫోన్ చేసి విషయాన్ని చెప్పిందట .దాంతోపాటు ఆమె ఫ్యామిలీలో కొన్ని ఇబ్బందుల వల్ల మీ సినిమాని చేయలేకపోతున్నాను అంటూ డైరెక్టర్ కి చెప్పడం జరిగిందట.

అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ సినిమా హీరో  నేరుగా శ్రీ లీలా కి ఫోన్ చేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. హీరో ఆమెతో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా  మంచి పేరు సంపాదించడం అంటే అంత ఈజీ  వ్యవహారం కాదు ...నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇది సరిపోదు ఇంకా ఎంతో కష్టపడాలి చాలా ఓపిగ్గా ఉండాలి అలాంటప్పుడే స్టార్ హీరోయిన్ అవ్వగలవు అంతేకాదు సినీ ఇండస్ట్రీలో వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దు... ఇలాగే నువ్వు వచ్చిన అవకాశాలను వదులుకుంటూ పోతే ఇండస్ట్రీలో తర్వాత కనబడకుండా పోతావు అంటూ ఆ హీరో శ్రీ లీల కి చెప్పారట. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: