ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ఒకప్పుడు నెంబర్ వన్ కామెడీ షో గా అందరిని ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ షో కాంట్రవర్సీలకు వేదికైంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ షోపై అనేక రూమర్లు వస్తున్నాయి. కంటెస్టెంట్లకు సరిగా జీతాలు ఇవ్వడం లేదని.. ఎప్పుడూ డబుల్ మీనింగ్ డైలాగులతో అడ్డమైన పంచులు వేస్తారని చాలామంది భావిస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ షో కి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ సైతం ఇటీవల జబర్దస్త్ షో నుండి తప్పకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఎప్పటి నుండో ఈ షో కి జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు మరియు రోజా లు సైతం ఈ షో నుండి బయటకు రావడం జరిగింది. 

ఇక ఎందుకు ఇలా ఒకరి తర్వాత మరొకరు బయటకు వెళ్ళిపోతున్నారు అన్న ప్రశ్నకి ఇప్పటిదాకా సమాధానం దొరకలేదు. ఇక వీరందరూ జబర్దస్త్ నుండి వెళ్లిపోయిన అనంతరం ఈ షో కి మూల స్తంభాలుగా నిలిచిన కొందరు కమెడియన్లు సైతం జబర్దస్త్ ను విడిచి సినిమాలలోకి వెళ్లడం జరిగింది. తాజాగా జబర్దస్త్ షోలో టాప్ కమెడియన్ గా ఉన్న ఆర్పి సైతం ఇప్పుడు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ రెస్టారెంట్ ను పెట్టుకున్నాడు. ఆయనతోపాటు గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ ఇలా ఒకరి తర్వాత ఒకరు నుండి తప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యాంకర్ రష్మీ కూడా జబర్దస్త్ ను మానేసిన సంగతి మనందరికీ తెలిసిందే. 

ఇక ఈమె స్థానంలో కొత్త యాంకర్ గా  సౌమ్యను జబర్దస్త్ కి తీసుకొచ్చారు. ఈమె ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఈమెపై అనేకమైన రూమర్లు కూడా రావడం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈమె కూడా జబర్దస్త్ నుండి తప్పుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె చేసింది నాలుగైదు షోలే అయినప్పటికీ ఈమెకు కొందరు టార్చర్ ఎక్కువైంది అని ఆది వంటి సీనియర్ కమెడియన్ పంచ్ డైలాగ్ లకు హర్ట్ అయిన సౌమ్య ఈ షో నుండి తప్పుకుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగా సౌమ్య ఈ షో నుండి తప్పకుండా లేదా అన్నది మాత్రం ఇంకా తెలీదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: