జేమ్స్ కామెరున్ దర్శకత్వంలో 2009లో వచ్చిన అవతార్ సినిమా సీక్వెల్ గా గత ఏడాది డిసెంబర్లో అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 180 కి పైగా భాషలలో విడుదల చేశారు. మొదటి రోజే తెలుగు రాష్ట్రాలలో రూ.30 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు భారీ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా సినిమా విడుదలై నేటికి నెల రోజులు కాబోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అనేది ఇప్పుడు చూద్దాం.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..  అవతార్ టు ది వే ఆఫ్ వాటర్ 2022 డిసెంబర్ 16వ తేదీన రూ.2000 కోట్ల బడ్జెట్తో చిత్ర పరిశ్రమలోని అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కింది.  ఇప్పుడు దేశీయ మార్కెట్లో కూడా వసూలు రాబడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా ప్రపంచ కలెక్షన్ల గురించి మాట్లాడితే అవతార్ 2 ది వే ఆఫ్ వాటర్ వారాంతంలో 441.70 మిలియన్ డాలర్ల ఓపెనింగ్ ను నమోదు చేసింది ఇక ప్రాథమిక అంచనాల కంటే మెరుగ్గా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో దేశీయ మార్కెట్లో ప్రారంభ వారాంతంలో 134.1 మిలియన్ డాలర్ లు వసూలు చేసింది. ఇకపోతే రోజు రోజుకి దాని ఆదాయాలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.


ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనే విషయానికి వస్తే యూఎస్ మరియు కెనడాలో రూ.1500 కోట్లు అలాగే ఓవర్సీస్ మార్కెట్లో రూ.3వేల కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ఇక చైనా నుండి రూ.825 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఈ సినిమా విడుదలైన 22వ రోజుకి రూ.12,494 కోట్ల రూపాయల వసూలు చేసినట్లు సమాచారం. అంతేకాదు అత్యధికం మరియు ఆల్ టైం రికార్డ్ సృష్టించిన ఈ సినిమా భారీ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది ఒక భారతదేశం నుంచే 3d గ్లాస్ చార్జీలు లేకుండా రూ.350 కోట్లు చార్జీలతో కలిపి రూ.750.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: