టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కొరటాల శివ చిరంజీవి తో భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఆచార్య సినిమా తో డిజాస్టర్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమం లోనే ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో తీస్తూ ఉండడం తో ఇక ఈ సినిమా ఏమవుతుందో అని అభిమానుల్లో ఇప్పటికే ఆందోళన ఉంది. ఇలాంటి సమయం లో ప్రస్తుతం కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకేక్కుతున్న సినిమాకు త్రిబుల్ ఆర్ టెన్షన్ పట్టుకుంది అన్నది తెలుస్తుంది.


 రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన చిత్రం త్రిబుల్ ఆర్. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఎంత బిగ్గెస్ట్ విజయాన్ని సాధించేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాతో అటు ఎన్టీఆర్ సైతం పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే  ఇప్పుడు త్రిబుల్ ఆర్ టెన్షన్ మాత్రం అటు కొరటాల శివ ఎన్టీఆర్ను భయ పెడుతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే రాజమౌళి తో ఇప్పుడు వరకు ఎన్టీఆర్ 4 సార్లు కలిసి నటించాడు.


 అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కానీ రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు అని చెప్పాలి. స్టూడెంట్ నెంబర్ వన్, యమదొంగ, సింహాద్రి సినిమాల తర్వాత వచ్చిన నెక్స్ట్ సినిమా అటు జూనియర్ ఎన్టీఆర్కు ఫ్లాప్ గానే మిగిలిపోయింది. కేవలం జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే కాదండోయ్ అటు ఎంతో మంది హీరోలకు కూడా రాజమౌళి మౌళితో సినిమా చేసి హిట్టు కొట్టాక తర్వాత సినిమా ఫ్లాప్ చవిచూడటం పరిపాటిగా మారింది. దీంతో ఎన్టీఆర్ 30 సినిమా పరిస్థితి ఏంటో అని అభిమానులు కూడా ఆందోళనలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: