సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా చూస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే సాధారణంగా త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో కూడా ఒక సీనియర్ హీరోయిన్ ఉండేటట్లుగా చూసుకుంటాడు. గతంలో ఆయన తెరకెక్కించిన అల వైకుంఠపురం సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్రలో కనిపించింది. అయితే మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాలో ఏ సీనియర్ హీరోయిన్ నటిస్తారు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో ఐశ్వర్య రాయిని త్రివిక్రమ్ సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే టాలీవుడ్ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు లభించింది. టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు అభ్యంతరం తెలపడం లేదు. ఇక మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమా మరియు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అవడంతో ఐశ్వర్యరాయ్ కూడా ఈ సినిమాకు ఓకే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే నిజంగానే ఐశ్వర్యారాయ్ మహేష్ బాబు సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తే ఒక అద్భుతం లా ఉంటుంది అని ఈ వార్త విన్న చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ గురించి సోషల్ మీడియా వేదికగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. త్రివిక్రమ్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది అని వీరి అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు సినిమాలో ఐశ్వర్యరాయ్ నెగిటివ్ సీడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో నటించనుంది అన్న సమాచారం కూడా వినబడుతుంది. సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఈ వార్తల్లో నిజం ఉందా లేదా అన్న విషయంపై క్లారిటీ రావాలి అంటే చిత్రబృందం స్పందించాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: