ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. చాలామంది సినీ సెలబ్రిటీలు వివాహం చేసుకున్నారు. అంతేకాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న చాలామంది కుర్ర హీరోలు సైతం పెళ్లి చేసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ కూడా రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా పెళ్లి పీటలు లేక పోతుంది అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఇక ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు సదా. 

జయం సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అంతే కాదు కుర్రకారులకు ఫేవరెట్ హీరోయిన్గా కూడా మారింది సదా. అయితే సదా తెలుగులోనే కాకుండా తెలుగుతోపాటు తమిళంలో కూడా అగ్ర హీరోల సరసన పలు సినిమాలలో నటించడం జరిగింది. హీరోయిన్ గా తక్కువ సినిమాలే చేసినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. అనంతరం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చింది సదా. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ సీనియర్ హీరోయిన్.అయితే తాజాగా సదా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.

 ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తన మనసుకు నచ్చిన వాళ్ళు దొరికితే ఖచ్చితంగా త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సీనియర్ హీరోయిన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన చిన్ననాటి స్నేహితుడిని సదా పెళ్లి చేసుకోబోతుంది అని తెలుస్తోంది. అంతేకాదు గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో కూడా ఉన్నారని సమాచారం.త్వరలోనే  పెళ్లికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం కోసం పెళ్లి విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత అఫీషియల్ గా ఈ విషయాన్ని వెల్లడించడానికి వెయిట్ చేస్తూ ఉందట సదా. త్వరలోనే తన పెళ్లి విషయానికి సంబంధించిన ఒక క్లారిటీ ఇవ్వబోతుందట ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: