సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను అద్భుతమైన రీతిలో ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం మహేష్ "సర్కారు వారి పాట" మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ నిర్మాణం లో రూపొందుతున్నటు వంటి మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులే అవుతున్న ఇప్పటి వరకు కూడా ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయ లేదు. దానితో ఈ సినిమా మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం ఎస్ ఎస్ ఎం బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... పూజా హెగ్డే ... శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రెండింటిని కూడా ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా మార్చి 22 వ తేదీన విడుదల చేయడానికి ఈ మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అతడు మరియు ఖలేజా మూవీ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించడంతో ఈ మూవీ పై మహేష్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నిర్మాతలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: