నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీలో బాలకృష్ణ సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించినుండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో శ్రీ లీల ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయ్యింది.

అలాగే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల చేయాలి అని ఈ మూవీ యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ... అందులో భాగంగా ఈ మూవీ షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా ఈ మూవీ ని విడుదల చేసే విధంగా ఈ చిత్ర బృందం ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే అఖండ ... వీర సింహా రెడ్డి లాంటి మంచి విజయవంతమైన మూవీ ల తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడం ... ఇప్పటివరకు కెరియర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడిమూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి  ఇది ఇలా ఉంటే ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ గా రుపొందుతున్న నేపథ్యంలో ఎన్ బి కే 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా చిత్రీకరణను ఈ మూవీ యూనిట్ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: