ఆర్ఆర్ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద పాన్ ఇండియా హిట్టుని అందుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఎన్టీఆర్ ని 1000 కోట్ల హీరోగా మార్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 1250 కోట్ల దాకా వసూళ్ళని రాబట్టింది.ఈ సినిమా ఎన్టీఆర్ ని కేవలం పాన్ ఇండియా హీరోగానే కాకుండా ఏకంగా గ్లోబల్ స్టార్ ని కూడా చేసేసింది. ఈ సినిమాతో ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదిగిపోయిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్.. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ టీ సిరీస్ ఓనర్‌ భూషణ్‌ కుమార్‌తో చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. అతన్ని తరుచుగా కలుస్తున్నారు.అయితే వీరు తప్పకుండా ఏదో పాన్ ఇండియన్ సినిమానే ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్‌ మీడియాలో న్యూస్ వైరల్ అయిపోతుంది.ఇంకా అంతేకాదు రీసెంట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30 వ మూవీ మూహూర్త కార్యక్రమానికి ఈయన వెళ్లిన విషయాన్ని బాలీవుడ్‌ మీడియా వారే గుర్తు చేస్తున్నారు.


ఎవరూ ఊరికే వెళ్లరు కదా ఏదో ఒక పర్పస్ అనేది ఉంటుంది కదా అని అంటున్నారు. ఖచ్చితంగా టీ సిరీస్‌ అధినేత ప్రొడక్షన్ లో .. టాలీవుడ్‌ యంగ్ టైగర్ పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నారని గట్టిగా సమాచారం తెలుస్తుంది.ఈ విషయాన్ని తారక్‌ కు ఇంకా తారక్‌ ఫ్యాన్స్‌కు ట్యాగ్‌ చేసి మరీ నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేస్తున్నారు బాలీవుడ్ మీడియా వర్గాల వారు.ఇక ఎన్టీఆర్ 30 వ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఇంకా జాన్వీ లుక్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అతి త్వరలోనే ఈ మూవీ నుంచి మేజర్ అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ సారి కొరటాల శివ ఖచ్చితంగా తన రేంజ్ కి తగ్గట్లు సాలిడ్ హిట్ ని అందుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్రయూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: