నాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సంగీత దర్శకుడు సంగీతం అందించిన ఈ మూవీ నుండి రెండు పాటలను ఈ చిత్ర బృందం విడుదల చేసింది. ఆ పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. 

ముఖ్యంగా ఈ మూవీ లోని చంకీల అనే సాంగ్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాష లలో ఒకే రోజు విడుదల చేయనున్నారు. దానితో ప్రస్తుతం నానిమూవీ ప్రమోషన్ లలో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నాడు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా దసరా మూవీ గురించి నాని కొన్ని కీలకా వ్యాఖ్యలు చేశాడు. దసరా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నాని మాట్లాడుతూ ... దసరా మూవీ తో మీ గుండెల్ని హత్తుకునే మాస్ మూవీ చూపిస్తాను. దసరా మూవీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నాని థాంక్స్ తెలిపారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: