పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వరుస మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా హరిహర వీరమల్లు మూవీ సెట్స్ లో ఉండ గానే పవన్ "వినోదయ సీతం" అనే మూవీ కి రీమేక్ గా రూపొందబోయే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన తన భాగం షూటింగ్ ను కూడా పవన్ పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో నటించడానికి ... అలాగే యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందబోయే "ఓ జి" అనే గ్యాంగ్ స్టార్ కథతో రూపొందబోయే మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ "వినోదయ సీతం" రీమేక్ మూవీ కోసం కేవలం 25 రోజులను మాత్రమే కేటాయించగా ... "ఓ జి" మూవీ కోసం కూడా దాదాపు ఇన్ని రోజులను మాత్రమే కేటాయించనున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ రెండు మూవీ లకు చాలా తక్కువ రోజులను కేటాయించిన పవన్ ... హరీష్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ కోసం మాత్రం చాలా ఎక్కువ రోజులను కేటాయించనునట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పక్క కమర్షియల్ ఎంటర్టైర్ మూవీ కావడం ... ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ... పాటలు ఉండడంతో ఈ సినిమా కోసం పవన్ ఏకంగా 90 రోజులను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా పవన్ ... హరీష్ దర్శకత్వంలో రూపొందిపోయే మూవీ కోసం చాలా రోజులను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పవన్ ... హరీష్ కాంబినేషన్ లో రూపొందిపోయే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: