పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హిట్ ... ఫ్లాప్ టాక్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొడుతూ ఉంటుంది. ఇలా తనకంటూ ఒక అద్భుతమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్న పవన్ మరి కొన్ని రోజుల్లో వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు.

 ఈ మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న తేరి మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 5 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి సమయం దగ్గర పడటంతో ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు హరీష్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ వేగవంతంగా చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా మంత్రి మల్లారెడ్డి ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఓ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న మల్ల రెడ్డి ... పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో నన్ను విలన్ పాత్ర కోసం హరీష్ శంకర్ అడిగాడు అని ... అందుకోసం చాలా సేపు నన్ను బతిమిలాడాడు అని ... కాకపోతే నేను మాత్రం విలన్ పాత్రలో నటించడం ఇష్టం లేదు అని చెప్పినట్లుగా తెలియజేశాడు. దీనితో ప్రస్తుతం మల్లా రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: