మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "రావణాసుర" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో రవితేజ సరసన ఏకంగా 5 హీరోయిన్ లు కనిపించ బోతున్నారు. 

మూవీ లో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్ ... దక్ష నాగర్కర్ ... మేఘ ఆకాష్ ... పూజిత పన్నుడా ... ఫరియా అబ్దుల్లా కనిపించనుండగా టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను మరియు టీజర్ ... ట్రైలర్ ... పాటలను కూడా విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 1 వ తేదీన సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదిక ..  హైటెక్ సిటీ ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఈ చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: