తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో  వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చత్రపతి అనే హిందీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి అదరణ లభించింది. ప్రస్తుతం హిందీ లో రూపొందుతున్న ఈ మూవీ తెలుగు లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి చత్రపతి అనే మూవీ కి అధికారిక రీమిక్ గా తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ బయటకు వచ్చింది.

శ్రీనివాస్ కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ మూవీ కి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ పై రామ్ ఆచంట మరియు గోపి ఆచంట బ్యాంక్రోల్ చేయనున్నారు. ఈ మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో 10 వ మూవీ గా రూపొందబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: