
నాని కెరియర్ లోనే ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ మూవీ.. అన్ని భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. భారీ అంచనాలతో మార్చి 31 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దసరా సినిమా మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక నైజాంలో అయితే మొదటి రోజా రికార్డు రేంజ్ వసూళ్లను సాధించింది. యూఎస్ఏ లోను వన్ మిలియన్ వసూళ్ల మార్క్ అందుకుంది అని చెప్పాలి. ఈ సినిమా మీద నాని ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడో ముందునుండి కనిపిస్తూనే ఉంది. ఇక ఈ సినిమాలో నాని నటన పీక్ లెవెల్ లో ఉంది అని చెప్పాలి. ఇక మరోవైపు కీర్తి సురేష్ అయితే నటనతో బీభత్సం సృష్టించింది.
ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాను ఇద్దరు స్టార్ హీరోలు వదులుకున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా కథను రామ్ చరణ్ కోసం రాసుకున్నాడట. రంగస్థలంలో పర్ఫామెన్స్ చూసిన తర్వాత విలేజ్ నేపథ్యంలో చరణ్తో ఒక సినిమా చేయాలని అనుకున్నడట సుకుమార్ శిష్యుడు, దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇక పెద్ద హీరో తనకు డేట్ ఇస్తాడో లేదో అని ఇక చెర్రీతో కలవలేదట. ఇక తర్వాత నితిన్ అయితే బడ్జెట్ కి సరిపోతాడని భావించి ఇక కథ వినిపించాడట. కానీ కొత్త దర్శకుడు కావడంతో నితిన్ శ్రీకాంత్ ఓదెలతో రిస్క్ చేయలేక రిజెక్ట్ చేశాడట. చివరికి ఈ కథ నాని దగ్గరకు వెళ్ళగానే అతను ఓకే చెప్పడం సినిమా తెరకెక్కడం.. ఇక ప్రేక్షకులకు ముందుకు రావడం జరిగిపోయింది.