తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కల హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్న సూర్య గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . సూర్య ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో విడుదల చేసి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు .

ఇది ఇలా ఉంటే ముఖ్యంగా సూర్య తెలుగు లో గజిని ... సింగం సిరీస్ మూవీ ల ద్వారా అదిరిపోయే రేంజ్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ ల ద్వారా సూర్య కు టాలీవుడ్ మాస్ జనాల్లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూర్య తన కెరీర్ లో 42 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఇప్పటి వరకు సూర్య కెరియర్ లో ఏ సినిమా ను నిర్వహించనంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని పాన్ ఇండియా స్థాయి కి మించి విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ అప్డేట్ కోసం సూర్య అభిమానులు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఫస్ట్ లుక్ కు సంబంధించిన అప్డేట్ ను ఏప్రిల్ 28 వ తేదీన ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: