సాయి ధరంతేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమా విడుదల నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి సాయి ధరంతేజ్ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియాలో, బుల్లితెరపై ఎక్కడ చూసినా కూడా ఈ మెగా మేనల్లుడే దర్శనమిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు సాయిధరమ్ తేజ్.



 ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా తేజ్.. ప్రపంచంలో సంపన్నులుగా కొనసాగుతున్న బిల్ గేట్స్, వారెన్ బఫెట్ కంటే తానే ధనవంతుడిని అంటూ సాయిధరమ్ తేజ్ చెబుతున్నాడు. డబ్బు కంటే విలువైన ప్రేక్షకుల ప్రేమ తనకు దక్కిందని.. దానివల్లే తాను వారిద్దరి కంటే ధనవంతుడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వరకు నేను సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంది అంటే చిత్ర పరిశ్రమ లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి పొందిన ప్రేమాభిమానమే. వాళ్లందరి ఆశీర్వాదం కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను. ఇంతమంది ప్రేమను ఇచ్చినందుకు ఆ దేవుడికి ఎప్పటికీ రుణపడి ఉంటా.


 ఇక బైక్ ప్రమాదం ఎలా జరిగింది అన్నది నాకు గుర్తులేదు. అలాంటి ఘటనలను అస్సలు గుర్తు పెట్టుకోవాలి అనుకోవట్లేదు. అందుకే మరిచిపోయాను. ఇసుక ఉండటం వల్లే ఆరోజు ప్రమాదం జరిగింది. 12 రోజులు పాటు కోమాలోనే ఉన్నాను. ప్రమాదం వల్ల నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. జీవితంలోనే కాదు మాటల్లోనూ బైక్ పైన బ్యాలెన్స్ గా ఉండాలని తెలుసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత డబ్బులు వస్తే దాచుకోవాలి అంటూ సాయి ధరంతేజ్ చెప్పాడు. అదేంటి తేజ్ ధనవంతుడే కదా అని విలేకరి ప్రశ్నించగా.. అవును బిల్ గేట్స్, వారెన్ బఫెట్ కంటే నేనే ధనవంతుడిని. ఎందుకంటే నాకు కోట్ల మంది ప్రేక్షకుల ప్రేమ ఉంది అంటూ సాయిధరంతేజ్ సమాధానం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: