
అయితే ప్రభాస్ నడవడానికి ఇలా కష్టంగా మారడానికి గల కారణం సాహూ సినిమా షూటింగ్లో జరిగిన కొన్ని గాయాలు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆది పురుష్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా ప్రెస్మీట్లో అతను సరిగ్గా నడవలేకపోయారన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ మోకాలికి శాస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఆ తర్వాత 5 చిత్రాలను షూటింగ్లో వరుసగా పాల్గొంటూ ఉండడం వల్ల రెస్టు లేకుండా చేయడంతో ప్రభాస్ మోకాలి నొప్పి ఇంకా తగ్గలేదు అన్నట్లుగా తెలుస్తోంది. దీంతో అభిమానులు ప్రభాస్ను కాస్త రెస్ట్ తీసుకొని త్వరగా కోలుకోవాలని తెలియజేస్తున్నారు.
సినిమా షూటింగులు కొద్ది రోజులు వాయిదా వేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకోమంటూ పలువురు నేటిజెన్లు సైతం సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ అన్ని కూడా దాదాపుగా రూ .500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ సినిమాలలోనే నటిస్తూ ఉన్నారు. అలా ఇప్పటివరకు తన చేతిలో నాలుగైదు సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఈ ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ లభించింది.. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం గతంలో టీజర్ విడుదల చేయకుండా డైరెక్ట్ గా ట్రైలర్ విడుదల చేసి ఉంటే ఈ సినిమాకు మరింత హైపు వచ్చి ఉండేదేమో అన్నట్లుగా అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. Vfx తో ఇప్పుడు ట్రైలర్ మరింత ఆకర్షణీయంగా మారింది. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి