ప్పెన సినిమాతో జనాల చేత బేవమ్మగా అనిపించుకున్న కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా రెండు సినిమాలలో నటించి విజయాలను తన ఖాతాలో వేసుకుంది ఈమె. కానీ ఇటీవల ఆమె నెట్టించిన సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాపులు అవుతున్నాయి. తాజాగా ఈమె నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను అలరించింది. బంగార్రాజు సినిమా హిట్ అయిన తర్వాత వీరిద్దరూ జంటగా కలిసి నటించిన సినిమా కస్టడీ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

సినిమా సక్సెస్ అవడంతో మళ్ళీ కృతి శెట్టి సక్సెస్ బాటపడుతుంది అని ఈమె అభిమానులు నమ్ముతున్నారు. ఇకపోతే కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కృతి శెట్టి ఇటీవల మీడియాకు ఇంటర్వ్యూలో ఇస్తూ వస్తున్నారు. ఈ సందర్భంలోనే ఒక విలేకరి ఉంటావా అంటావ్ అలాంటి పాటలకు చేస్తారా అని ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. దానికి కృతి శెట్టి అదిరిపోయే జవాబును ఇచ్చింది. ప్రస్తుతానికి తాను అలాంటి సాంగ్స్ చేయను అంటూ బల్ల గుద్దినట్టు చెప్పింది. కృతి శెట్టి తనకు కెరియర్ చాలా ఉంది అని ఇప్పటిలో అలాంటి పాటలు చేయను అంటూ స్పష్టం చేసింది. ఇక అలాంటి పాటలపై తనకు కొంచెం కూడా ఐడియా లేదు అంటూ వెల్లడించింది.

అంతే కాదు తన సినీ ప్రయాణంలో ఆమె తెలుసుకున్నది ఒకటే.. సౌకర్యంగా లేకపోతే చేయకపోవడం మంచిది అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి. కానీ ఊ అంటావా ఊహు అంటావా సాంగ్లో సమంత మాత్రం చాలా బాగా చేసింది అని చెప్పుకొచ్చింది. గతంలో శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కృతి శెట్టి రొమాంటిక్ సీన్ లో నటించడం మనం చూశాం. ఇక ఆ సినిమా అప్పుడే రొమాంటిక్ సీన్లు నటించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని గతంలో వెల్లడించింది. కానీ ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్తో సినిమాలో రొమాన్స్ ఉన్న కూడా కృతి నుండి ఐటెం సాంగ్స్ మాత్రం రావని అర్థమైంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: