
దీనిపై స్పందించిన కరాటే కళ్యాణి పూర్తిస్థాయిలో ఫైర్ అవుతున్నారనే చెప్పాలి.. అసలు విషయంలోకి వెళితే ఖమ్మంలో 54 అడుగుల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై అభ్యంతరాలు రావడంతో కోర్టులో కూడా వాదనలు బాగా జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ కృష్ణుడి రూపంలో ఉండడమే అభ్యంతరాలను వ్యక్తం చేసేలా చేస్తోంది. కరాటే కళ్యాణి తమ యాదవ కులానికి కలంకం కలుగుతుంది అంటూ విమర్శలు చేస్తూ కోర్టుకెక్కగా కోర్టు ఆమెకు మద్దతుగా నిలిచినా ప్రజలు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు.
కరాటే కళ్యాణి మాట్లాడుతూ...నేను చేసిన తప్పు ఏమిటో నాకు మాత్రం అర్థం కావడం లేదు నేను మహానటుడు ఎన్టీఆర్కు వ్యతిరేకం కాదు.. కృష్ణుడి రూపంలో ఆయన విగ్రహం పెడితే సమాజంలోకి తప్పుగా వెళుతుందని భావించాను. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే ఇక దేవుళ్ళ విగ్రహాలు ఎందుకు ? మనం ఎందుకు ఆ విగ్రహాలను పూజించాలి ?అంటూ ఆమె ప్రశ్నించారు. మాకు శ్రీకృష్ణుడు ఎంతో ఇష్టమైన దైవము అక్కడ ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే దేవుడికి అప్రతిష్ట జరుగుతుందని మేము నమ్ముతాము అందుకే ఆ విగ్రహ ఏర్పాటును ఆపేయండి అని అడిగాను. కానీ ఎందుకు నాకు సభ్యత్వం నుంచి తొలగించారు.. అన్నది మాత్రం అర్థం కావడం లేదు అంటూ తెలిపింది.