
ఇప్పటివరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆది పురుష్ చిత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు.. ముఖ్యంగా రాముడికి హనుమంతుడిలా ఆది పురుష్ చిత్రానికి సంగీతం హైలెట్గా నిలుస్తున్నట్లు సమాచారం. సినిమాకు కావాల్సిన బూస్టింగ్ కూడా సంగీతమే అందిస్తోందని సినీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు జై శ్రీరామ్, రామ్ సీతా రామ్ అనే పాటలు రెండు కూడా బూస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో కూడా చాలా ఘనంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫ్రీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఈ సినిమాకు మరింత బస్ ఏర్పడిందంటే కచ్చితంగా ఈ సినిమా సరికొత్త రికార్డులను సైతం సృష్టిస్తుందని చెప్పవచ్చు. మొదట ఈ సినిమా టీజర్ ని విడుదల చేయడం వల్ల కాస్త నెగిటివ్ టాక్ ఏర్పడింది.. కానీ ఈ మధ్యకాలంలో ఈ సినిమా నుంచి ఎలాంటివి అప్డేట్ వచ్చినా సరే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే నెల 16వ తేదీ వరకు ఆగాల్సిందే.. ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్-k చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలలో కూడా నటిస్తూ ఉన్నారు.