
అయితే ఇప్పుడు ఒక ప్రముఖ కొరియన్ నిర్మాణ సంస్థ కొరియా భాషలో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తూ దర్శకుడు జీతూ జోసఫ్ తో సంప్రదింపులు జరుపుతోంది అన్న వార్తలు విన్నవారికి ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ క్రియేటివ్ దర్శకుడు మోహన్ లాల్ తో ‘రామ్’ అనే భారీ సినిమాను రెండు భాగాలలో తీస్తున్నాడు. ఈసినిమా పూర్తి అయిన తరువాత మళ్ళీ మోహన్ లాల్ తో ‘దృశ్యం 3’ సీక్వెల్ ను తీయాలని ఆలోచనలు చేస్తున్నాడు.
ఈ ప్రయత్నాలు ఇలా ఉండగానే ఇతడి దృష్టి హీరో నాని పై పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ నేపద్యంలో జరిగే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథను జీతూ జోసఫ్ నానికి చెప్పినట్లు సమాచారం. ఆ కథ నానికి నచ్చడంతో ఆ స్టోర్ లైన్ ను డెవలప్ చేయమని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ వచ్చే సంవత్సరం ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు. ఈమూవీతో నాని మార్కెట్ మాలీవుడ్ లో కూడ బాగా పెరిగే ఆస్కారం ఉంది.
ఇది ఇలా ఉంటే ‘దసరా’ సక్సస్ ఇచ్చిన జోష్ తో నాని ఒక పాప సెంటిమెంట్ కథను ఎంచుకుని యంగ్ డైరెక్టర్ శౌర్యవ్ తో చేస్తున్న మూవీ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. ఈ తండ్రి కూతుళ్ళ ఎమోషనల్ డ్రామాలో నాని పక్కన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంటే మరొక కీలక పాత్రలో శృతి హాసన్ నటిస్తోంది..