తెలుగు చిత్ర పరిశ్రమంలో జెడి చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో  ఎంతోమంది హీరోలు, నటీనటులు ఉన్న తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకున్నాడు జెడి చక్రవర్తి. ఇప్పటికి ఎంతోమంది అమ్మాయిలకు మనసు దోచిన క్రేజీ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ప్రియ శిష్యుడిగా కూడా జేడీ చక్రవర్తి కొనసాగుతున్నాడు. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. గులాబీ, బొంబాయి ప్రియుడు, ప్రేమకు వేళాయరా, మనీ మనీ లాంటి ఎన్నో సినిమాల్లో నటించగా.. ఈ సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి.


 అయితే కేవలం హీరోగా మాత్రమే నటించి ఊరుకోకుండా ఇతర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. ఇకపోతే జెడి చక్రవర్తి తన సినిమాలతోనే కాదు తన ఎఫైర్లతో కూడా ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయేవారు. ఒక గతంలో జెడి చక్రవర్తికి ఎంతో మంది హీరోయిన్లకు ఎఫైర్ నడుస్తుందంటూ వార్తలు వచ్చాయి. ఇలా ఈ నటుడు ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. అప్పట్లో మహేశ్వరి, రంభ లాంటి హీరోయిన్లతో జెడి చక్రవర్తికి అఫైర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఈ విషయంపై ఓపెన్ అయ్యాడు జె.డి చక్రవర్తి. అతను నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఓంకార్ షోలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటివరకు ఎంతమంది హీరోయిన్స్ తో ప్రేమలో పడ్డారు అంటూ ఓంకార్ ప్రశ్నిస్తే.. మా నాన్న మీద ఒట్టేసి చెబుతున్నా నేను ఇప్పటివరకు నటిచిన అందరూ హీరోయిన్ లని ప్రేమలో పడేయాలని చూసాను అంటూ షాంకింగ్ ఆన్సర్ ఇచ్చాడు జెడి  చక్రవర్తి.


 ఇక జెడి చక్రవర్తి ఇచ్చిన ఆన్సర్ తో అందరూ కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. వామ్మో సైలెంట్ గా కనిపించే జె.డి చక్రవర్తి లో ఇలాంటి ప్లే బాయ్ కూడా ఉన్నాడా అని ఎంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే జెడి  చక్రవర్తి నటిస్తున్న వెబ్ సిరీస్ లో అటు ఈషా రెబ్బ కూడా కీలకపాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Jf