తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ త్రిష కూడా సుపరిచితమే.. ఈమె సినిమాల లైనప్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. హీరోయిన్ త్రిష కు మాత్రం ఇతర హీరోయిన్ల కంటే రివర్స్లో జరుగుతోందని చెప్పవచ్చు. ఆమె వయసు పెరుగుతుంటే అందం కూడా పెరిగిపోతోంది .అందుకే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.. వయసు పెరుగుతున్న తర్వాత కూడా అవకాశాలు చేజిక్కించుకుంటున్న హీరోయిన్లలో త్రిష మాత్రమే ముందు వరుసలో ఉన్నది. త్రిష హీరోయిన్ గా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది.


ఇటీవలే డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -2 చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో త్రిష అందానికి సైతం ప్రేక్షకులు మంత్రము వద్దులే అయ్యారని చెప్పవచ్చు. ఈ వయసులో కూడా ఇంతటి అందంతో అందరిని ఆశ్చర్యపరిచింది.. కేవలం ప్రేక్షకులను మాత్రమే కాకుండా అక్కడికి వచ్చిన దర్శక నిర్మాతలు కూడా ఒకసారి గా షాక్ అయ్యారు. అందుకే ఈమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇద్దరు స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది త్రిష.

త్రిష ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి తో కలిసి లియో సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.. ఇక తాజాగా మరో రెండు సినిమాలకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అందులో స్టార్ హీరో ధనుష్, అజిత్ సినిమాలలో హీరోయిన్గా త్రిష నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగులు కూడా త్వరలోనే మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.నాలుగుపదుల వయసులో కూడా త్రిష వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశం దక్కించుకోవడంతో ఇదొక సరికొత్త రికార్డు అని అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఏదిఏమైనా త్రిషాను ఢీకొట్టేవారు లేరని అభిమానులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: