తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో నాగ చైతన్య ఒకరు. ఈ యువ నటుడు జోష్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో క్లాస్ అండ్ మాస్ అండ్ కమర్షియల్ మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన యువ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు కస్టడీ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. 

ఈ సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా ... తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో అరవింద స్వామి విలన్ పాత్రలో నటించగా ... ప్రియమణిమూవీ లో ముఖ్యమంత్రి పాత్రలో నటించింది. ఇళయరాజా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీ ని తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకే కాలంలో రూపొందించారు. అలాగే ఈ సినిమాను తెలుగు , తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా మిగిలింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచిన ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ సినిమాను తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ భాషలో జూన్ 9 వ తేదీ నుండి ఈ మూవీ ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు ఆదరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: