దసరా తర్వాత నాని చేస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. శౌర్యువ్ అనే నూతన దర్శకుడితో నాని సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఈ సినిమాలో మృణాల్ తో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు శృతి హాసన్. నాని సినిమాలో శృతి హాసన్ కూడా ఉంది. అయితే శృతి హాసన్ ది సినిమాలే పాత్ర చిన్నదే అయినా చాలా కీ రోల్ అని అంటున్నారు. సినిమాలో నాని ప్రేయసిగా శృతి హాసన్ కనిపిస్తుందని తెలుస్తుంది,.

నాని లవర్ శృతి హాసన్ కాగా కొన్ని కారణాల వల్ల ఆమెతో విడిపోయి మృణాల్ ని పెళ్లి చేసుకుంటాడు. సినిమాలో శృతి హాసన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయని అంటున్నారు. నానితో శృతి హాసన్ మొదటిసారి కలిసి నటిస్తుంది. శృతి హాసన్ ఓ పక్క ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తుంది. అయితే సలార్ కన్నా శృతి హాసన్ కి నాని సినిమా కథ చాలా నచ్చినట్టు టాక్. అంతేకాదు మృణాల్ ఠాకూర్ కి కూడా ఈ సినిమా మరో హిట్ ఇస్తుందని అంటున్నారు.

ఈ ఇయర్ మొదట్లో చిరుతో వాల్తేరు వీరయ్య, బాలయ్యతో వీర సిం హా రెడ్డి సినిమాలు చేసిన శృతి హాసన్ ప్రభాస్ సలార్ నాని 30వ సినిమాలో నటిస్తుంది. అయితే ఈ రెండు సినిమాల తర్వాత శృతి హాసన్ తెలుగులో మరో ఛాన్స్ అందుకోలేదు. ఆల్రెడీ నాని సినిమాకు సంబంధించిన తన పోర్షన్ అంతా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. నాని 30వ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అంటున్నారు. అదే జరిగితే నాని కి దసరా తర్వాత మరో సూపర్ హిట్ దక్కినట్టే లెక్క. శృతి హాసన్ కూడా నాని సినిమా తర్వాత మళ్లీ తప్పకుండా మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: