అయితే ఇప్పుడు ఇక ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్టు-కే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో భారీ తారాగణం కూడా ఉంది అని చెప్పాలి. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, ప్రభాస్ సరసన దీపికా పదుకొనే, కీలకపాత్రలో దిశాపటని నటిస్తున్నారు. ఇక ఇటీవలే కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంత భారీ తరాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.
నాగ్ అశ్విన్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే రూపొందుతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 150 కోట్ల పారితోషకం తీసుకుంటూ ఉండగా.. ఇక కమల్ హాసన్ 20 కోట్లు, దీపిక పదుకొనే పదకోట్లు, అమితాబ్, దిశా పటాన్ని మరికొందరు నటులకు 20 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఇక ప్రొడక్షన్ కాస్ట్ 400 కోట్లతో కలిపి మొత్తంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది అన్నది తెలుస్తోంది. అయితే నాగ్ అశ్విన్ సినిమాలు ఎంతో భిన్నంగా ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంటాయి. మరి ఇప్పుడు ప్రాజెక్టు కే ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి