ఇదిలా ఉండగా తాజాగా సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా మరొకవైపు సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టేసింది చిత్ర బృందం.తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు నాని ఈ సినిమాలో నాని కూతురిగా బేబీ కైరా ఖన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు డియర్ నాన్న అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నారట ఇదిలా ఉండగా తాజాగా నాని గాలిలో వేలాడుతూ ఒక వెరైటీగా ప్రమోషన్స్ అప్డేట్ ఇవ్వడం జరిగింది . స్కై డైవింగ్ చేస్తూ తన 30వ సినిమా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసే డేట్ ను కూడా అనౌన్స్ చేశారు నాని.
ఇదిలా ఉండగా జూలై 13 వ తేదీన ఈ సినిమా గ్లిమ్స్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది. అయితే ఇలా స్కై డైవింగ్ చేస్తూ గ్లింప్స్ ని రిలీజ్ చేసే డేట్ ప్రకటించడం చాలా వింతగా ఉందని.. ఇది చూసిన నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో నాని మరొక అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటారు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే నాని ఒకవైపు హీరోగా.. మరొకవైపు నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ బాట పట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి