ఈమె ఇలా సోషల్ మీడియాకు దూరం కావడానికి గల కారణాలను కూడా తాజాగా వెల్లడించారు.చాలా రోజుల తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన ఈమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి అంటూ ప్రశ్నించారు నేటిజన్స్.అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినటువంటి ఈమె తనకు ఒక్క క్షణం పాటు తీరిక లేదని వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్లే తాను సోషల్ మీడియాకు దూరమయ్యాను అంటూ ఈ సందర్భంగా తాప్సి సోషల్ మీడియాకు దూరం కావడానికి గల కారణాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈమె షారుక్ ఖాన్ తో కలిసి డంకీ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇలా షారుఖ్ ఖాన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అతనితో కలిసిన నటించడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకోగలము అంటూ తాప్సీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి