కన్నడ టాప్ హీరోయిన్‌ గా దూసుకుపోయి తరువాత రాజకీయ వేత్తగా మారిన రమ్య స్పందన మృతి చెందిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గుండెపోటుతో ఆమె మరణించిందని సోషల్‌ మీడియాలో పలువురు ‘RIP’ అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. ఆమె చనిపోయిందంటూ కొన్ని మీడియా కంపెనీలు కూడా ఆర్టికల్స్ రాసి అత్యుత్సాహం చూపించాయి.అయితే అసలు అందులో ఏ మాత్రం నిజం లేదని, అవన్ని ఒట్టి ఫేక్‌ న్యూస్‌లని ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. రమ్య క్షేమంగానే ఉందని ఆమె స్నేహితురాలు ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టింది. ‘నేను రమ్యతో ఇప్పడే మాట్లాడాను. ప్రస్తుతం తను జెనీవాలో ఉంది. గురువారం ఆమె బెంగళూరు రానున్నారు’ అని ఆమె స్నేహితురాలు చిత్ర సుబ్రమణ్యం ట్వీట్ చేసింది.ఇక మరో ట్విట్‌లో ‘జెంటిల్ ఉమెన్‌తో వండర్‌ఫుల్ మీటింగ్ జరిగింది.మేము జెనీవాలో డిన్నర్ చేశాం.అలాగే బెంగుళూరు గురించి, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకొన్నాం’ అని చిత్ర సుబ్రమణ్యం వెల్లడిస్తూ ఆమె ఫోటోను కూడా పోస్ట్‌ చేసింది.అయితే రమ్య మరణ వార్త తెలియగానే కన్నడ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. ఇక అదంతా కూడా పుకారని తేలడంతో ఊపిరి పీల్చుకుంది. పే


రుకు రమ్య కన్నడ నటినే అయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె బాగా సుపరచితమే. తెలుగులో రమ్య కళ్యాణ్‌రామ్‌తో కలిసి ‘అభిమన్యు’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఇప్పటి దాకా మరో సినిమా చేయలేదు. ఇక తెలుగులో కంటే తమిళ్ లో బాగా ఫేమస్ ఆమె నటించిన పలు తమిళ సినిమాలు డబ్బింగ్‌ రూపంలో రిలీజయి ఇక్కడ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ సినిమాలో ప్రియ పాత్రలో రమ్య అందరి మనసులు దోచుకుంది.ఇక రెండు దశాబ్దాల కిందట పునీత్‌ రాజ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘అభి’ సినిమాతో రమ్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రమ్య. తొలి సినిమాతోనే తమిళనాట తిరుగులేని స్టార్ డం ని తెచ్చుకుంది. ఆ తర్వాత ఉపేంద్ర, సుదీప్‌ వంటి స్టార్‌ హీరోలతో కూడా జోడీ కట్టింది. ఇక తమిళంలో కూడా రమ్య.. ధనుష్‌, సూర్య, జీవా వంటి స్టార్‌ హీరోలతో సినిమాలు చేసింది. రెండు దశాబ్దాల కాలంలో రమ్య మొత్తం 40 సినిమాలకు పైగా చేసింది. మొన్న రిలీజైన ‘బాయ్స్‌ హాస్టల్‌’ సినిమా కన్నడ వెర్షన్‌లో కూడా రమ్య నటిచింది. ప్రస్తుతం ఆమె నటించిన ‘ఉత్తరఖాండ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: