రామ్ పోతినేని తాజాగా స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ దర్శకుడుగా గుర్తింపును సంపాదించుకున్న బోయపాటి శ్రీను ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రెస్ లో ముందు వరుసలో ఉన్న శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఏర్పాటు చేసి అందులో భాగంగా ఈ మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని "కల్ట్ మామ" అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసింది.

ఇకపోతే ఈ సాంగ్ లో రామ్ తో పాటు ఊర్వశి రౌటేలా కూడా స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 7.51 మిలియన్ వ్యూస్ ను ... 104.8 కే లైక్స్ ను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సాంగ్ లో రామ్ వేసిన స్టెప్ లు ... ఊర్వశి రౌటేలా అందచందాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: