యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్కి కొమరం భీమ్ పాత్రలో నటించినందుకు గానూ అవార్డు సైతం దక్కింది. దీంతో ఎన్టీఆర్ ఈ అవార్డు అందుకోవడం కోసం తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లడం జరిగింది. అలా ఈనెల 15 16 తేదీలలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలా ఈ కార్యక్రమం పూర్తయినప్పటికీ రెండు రోజులపాటు తన కుటుంబంతో అక్కడే ఉండి దుబాయ్ పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

అయితే తాజాగా దుబాయ్ వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చేడు జూనియర్ ఎన్టీఆర్. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేయడంతో వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెకేషన్ నుండి ఇండియా చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి దేవర సినిమా షూటింగ్లో బిజీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో మరొక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయడానికి మెగాడ్స్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.  

ఇక ఈ యాక్షన్స్ అన్ని వేశాలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న మొదటి సినిమా దేవర కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే  ఏడాది వేసవికాలంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అలా ఈ సినిమాకి సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: