తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో సంతోష్ శోభన్ ఒకరు. ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మంచి విజయం మాత్రం ఈ నటుడుకి దక్కడం లేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ నటుడు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన లేడి డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన అన్ని మంచి శకునములే అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడం పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత ఈ నటుడు నటించిన కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసింది. సంతోష్ శోభన్ తదుపరి మూవీ కి చిత్ర బృందం "జోరుగా హుషారుగా షికారు పోదామా" అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. 

ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సంవత్సరం సంతోష శోభన్ మొదటగా కళ్యాణం కమనీయం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఆ తర్వాత శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా ప్లాప్ అయ్యింది. మరి వరుస అపజయాలతో డీలా పడిపోయిన ఈ యువ హీరో జోరుగా హుషారుగా షికారు పోదామా సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: