
అయినప్పటికీ ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అయితే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు గా తెలుస్తుంది. ఈ సినిమాతో ఆయన మంచి హిట్ కూడా కొట్టబోతున్నట్టు గా తెలుస్తుంది. ఈ సినిమా హిట్ కొడితే మారుతీ పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందుతాడు. నిజానికి ప్రభాస్ మారుతీ కి అవకాశం ఇవ్వాల్సిన పనిలేదు కానీ,యువి క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ ఇద్దరు కూడా మారుతీ కి మంచి ఫ్రెండ్స్ కావడం తో వాళ్లే మారుతీ, ప్రభాస్ కాంబో ని సెట్ చేసి ప్రభాస్ తో ఈ సినిమా చేయిస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం మారుతీ ఈ సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది ఇక ఈ సినిమా మారుతికి చాలా కీలకమనే చెప్పాలి...ఈ సినిమాతో సక్సెస్ కొడితే ఇండస్ట్రీ లో ఇక మారుతీ కి తిరుగు ఉండదు ఆయన కూడా స్టార్ డైరెక్టర్ల లిస్టు లో చేరిపోతాడు. అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోతాడు.అందుకోసమే మారుతి ఈ సినిమా మీద ఎక్కువ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది... ఈ సినిమా సక్సెస్ అవుతుందో లేదో చూడాలంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.