రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే వీరిద్దరికి తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఉంది. అలాగే ఆఖరుగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో స్కంద మూవీ అనౌన్స్ అయిన వెంటనే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అలాగే రామ్ కూడా ది వారియర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కున్నప్పటికీ ఈ నటుడికి కూడా తెలుగు లో మంచి క్రేజ్ ఉండడంతో వీరి కాంబినేషన్ లో మూవీ రూపొందబోతుంది అని తెలియడంతోనే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

అలాగే ఆ తర్వాత వీరు ఈ సినిమాను తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో ఈ సినిమాలో స్టోరీ బలంగానే ఉండి ఉంటుంది ... అందుకే మీరు పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు అని జనాలు భావించారు. అందుకు తగినట్టుగానే వీరు కూడా ఈ సినిమాను పూర్తి చేశారు. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. ఇకపోతే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.

ఆ తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇలా వీరికి కాస్త ఎక్కువ సమయం దొరకడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్ లను నిర్వహిస్తారు అని జనాలు భావించారు. కానీ ఈ సినిమా విడుదలకు ఇంకా కేవలం 7 రోజులో మాత్రమే మిగిలి ఉన్న ఈ మూవీ మేకర్స్ మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను తెలుగు రాష్ట్రాల్లో కూడా నిర్వహించడం లేదు. మరి ఈ మూవీ మేకర్స్ ఎందుకు ఇలా చేస్తున్నారా అనేది పెద్దగా ఎవరికి తెలియడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: