
ఈ ఈవెంట్ కి వెంకయ్య నాయుడు తో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,మోహన్ బాబు,న్యాచురల్ స్టార్ నాని, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు. సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా వీళ్లకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఇకపోతే ఈ ఈవెంట్ కి నాగార్జున తన సొంత సోదరుడిగా భావించే మెగాస్టార్ చిరంజీవి రాకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నాగేశ్వర రావు గారు అంటే చిరంజీవి కి ఆరాధ్య దైవం తో సమానం.ఆయన తల్లి అంజనా దేవి నాగేశ్వర రావు గారికి వీరాభిమాని. ఇక నాగేశ్వర రావు గారి గురించి ఎప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినా చిరంజీవి మనస్ఫూర్తిగా ఎంతో సంతోషం తో, పొగడ్తలతో ముంచి ఎత్తుతాడు. ఇలాంటి సందర్భాలు గతం లో మనం ఎన్నో చూసాము.
అలాంటి చిరంజీవి ఎందుకు ఈ విగ్రహావిష్కరణ కి రాలేదు అని సోషల్ మీడియా లో అభిమానులు మాట్లాడుకుంటున్నారు. 'భోళా శంకర్' ఫ్లాప్ అయిన తర్వాత చిరంజీవి ఏ ఈవెంట్ లో కూడా ఈమధ్య కనిపించడం లేదు.ఆ సినిమా ఫ్లాప్ చిరంజీవి ని కృంగదీసింది అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇది పక్కన పెడితే 'భోళా శంకర్' సినిమా తర్వాత చిరంజీవి తన మోకాళ్ళకు సంబంధించి సర్జరీ చేయించుకున్నాడు. డాక్టర్లు ఎక్కువగా మోకాళ్లపై వత్తిడి పెట్టొద్దు, విశ్రాంతి అత్యవసరం అని చెప్పడం తో చిరంజీవి ఈవెంట్స్ కి వెళ్లడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. చిరంజీవి ని ఆరాధ్య దైవం గా భావించే బ్రహ్మానందం రెండవ కొడుకు పెళ్లి రీసెంట్ గానే జరిగింది,ఈ పెళ్ళికి కూడా చిరంజీవి హాజరు కాలేకపోయారు. ఇదంతా ఆయనకీ జరిగిన మోకాళ్ళ సర్జరీ కారణంగానే అని తెలుస్తుంది.