
అయితే అప్పట్లో ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి హీరో గా తెలుగు లో రీమేక్ చేద్దాం అనుకున్నారు. రాకేష్ రోషన్ నిర్మాణం లోనే, ప్రముఖ డైరెక్టర్ కోదండ రామి రెడ్డి దర్శకత్వం లో ప్రారంభించారు. మాతృక లో బాలనటుడిగా నటించిన హృతిక్ రోషన్ ఈ సినిమాలో కూడా నటించాడు. అయితే కొంత కాలం షూటింగ్ చేసిన తర్వాత బడ్జెట్ అనుకున్న దానికంటే లిమిట్ దాటిపోయింది.అప్పట్లో కోటి రూపాయిలు ఖర్చు చేస్తే వంద కోట్ల రూపాయలతో సమానం, అలాంటిది ఈ చిత్రం రీమేక్ చెయ్యడానికి దాదాపుగా మూడు కోట్లు బడ్జెట్ అయ్యే రేంజ్ ఉన్నింది అట. దీంతో ఈ సినిమాని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సినిమా చేసి ఉంటే చిరంజీవి మరియు హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన ఏకైక తెలుగు సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించేది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.