తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా స్టార్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను అట్రాక్ట్ చేస్తోంది ఈ చిన్నది. 20 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా త్రిష మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చేతినిండా సౌత్ ఇండియాలోని ఆగ్ర హీరోలతో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలో తనపై

పెళ్లి పుకార్లు పెద్ద ఎత్తున రావడంతో దానికి ముగింపు పలుకుతూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది త్రిష. ఇక త్రిశా తన సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలపై స్పందించి ఇలా పేర్కొంది.. ప్రియమైన మీరు మీతో పాటు ఉన్న మీ బృందం ఎవరో మీకు తెలుసు.. శాంతంగా ఉండండి.. ఇంతటితో పుకార్లు ఆపేయండి అంటూ తనదైన స్టైల్ లో ఈ వార్తలకి ముగింపు పలికింది త్రిష. గత కొన్ని రోజులుగా హీరో విజయ్ చేస్తున్న సినిమా ప్రమోషన్ చాలా సైలెంట్ గా అవుతూ ఉండడంతో నటి త్రిష సైతం అదే పదాలను ఉపయోగించి ఈ వార్తలకి రిప్లై ఇచ్చింది.

దీంతో ఈ విషయం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది.  ఇది విజయ్ అతని బృందానికి వార్నింగ్ ఇస్తున్నావు కదా అని చాలామంది కామెంట్ లో చేస్తున్నారు. కానీ వాటికి మాత్రం రిప్లై ఇవ్వలేదు త్రిష. వరుసగా విజయ్ అజిత్ వంటి స్టార్ హీరోలు సినిమాల్లో నటిస్తోంది. ఈ విషయం నచ్చని ఎవరో కావాలనే ఇలాంటి పుకార్లను పుట్టిస్తున్నారు అని చాలామంది వాపోతున్నారు. అయితే గత కొన్ని నెలలుగా త్రిషపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో వస్తున్న తరుణంలో వాటన్నిటికీ ఫుల్స్టాప్ పెట్టింది. దీంతో ప్రస్తుతం త్రిష క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: