మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభం లోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ సినిమాలో నటించాడు. భోళా శంకర్ సినిమా మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ ను అందుకుంది. భోళా శంకర్‌ సినిమా భారీగా నష్టాలు తెచ్చి పెట్టింది .చిరు కెరీర్‌లో ఆచార్యకు మించిన ఫ్లాప్‌ మరోటి రాదులే అనుకుంటున్న ఫ్యాన్స్‌కు దానికి మించి ఫ్లాప్‌గా భోళాశంకర్‌ నిలిచింది. ప్రస్తుతం చిరుకు ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.. దాని కోసం చిరు బాగా ఆలోచించి బింబిసార దర్శకుడిని రంగంలోకి దింపాడు. బింబిసార తర్వాత దాని సీక్వెల్‌ను తెరకెక్కించాలని ముందుగా ప్లాన్‌ చేసుకున్న వశిష్ట అనుకోని విధంగా చిరు సినిమా ఆఫర్ అందుకున్నారు.చిరూ బర్త్డే కానుక గా రిలీజైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది.

 పంచభూతాలను ఏకం చేసే ఓ కాలచక్రాన్ని పోస్టర్‌లో చూపిస్తూ సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్‌ చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్‌ సోషల్‌ మీడియాను తెగ వైరల్ అవుతుంది.. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. కాగా ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని సమాచారం.. అంతేకాకుండాఈ సినిమాలో దాదాపు నలుగురు హీరోయిన్‌లు తీసుకోనున్నారట.అందులో అనుష్క శెట్టి, మృనాళ్‌ థాకూర్‌ దాదాపుగా కన్ఫర్మ్‌ అయినట్లు సమాచారం.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకంటున్న ఈ సినిమా ఇదే ఏడాది చివరి లో షూటింగ్‌ మొదలు పెట్టనుందని సమాచారం.యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందించనున్నాడు. దాదాపు మూడు శతాబ్దాల తర్వాత చిరూ, కీరవాణి కాంబోలో సినిమా వస్తుంది. ఇక ఈ సినిమా కంటే ముందుగా చిరు కళ్యాణ్ కృష్ణ కురసాలతో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా పూర్తయిపోయినట్లు సమాచారం. చిరు పెద్ద కుమార్తే సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తుంది.మెగాస్టార్ 156 సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: