తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ అడ్డాల తాజాగా పెదకాపు 1 అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో ఈయన కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో ఈయన పాత్ర కూడా హైలైట్ గా నిలుస్తుంది. అలాగే చిన్న చిన్న ప్రచార చిత్రాల్లో కూడా ఈయన తన నటనతో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించాడు. ఇక మొత్తం సినిమా విడుదల అయితే ఈయన తన నటనతో ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తాడో అనే విషయం తెలుస్తుంది. ఇకపోతే ఈ చిత్ర బృందం ఈ సినిమాను సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దానితో ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రచారాలను కూడా ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. 

దానికి ప్రేక్షకుల నుండి పర్వాలేదు అనే స్థాయిలో రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 23 వ తేదీన సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదిక ... హైటెక్ సిటీలో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే శ్రీకాంత్ అడ్డాలమూవీ తో దర్శకుడి గా ... నటుడిగా తనను తాను ఏ రేంజ్ లో ప్రూవ్ చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: