నాచురల్ స్టార్ నాని ఆఖరుగా దసరా అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మహానటి కీర్తి సురేష్ , నాని సరసన హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల అయ్యి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని ప్రపంచ వ్యాప్తంగా భారీ కలక్షన్ లను కూడా వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించి భారీ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి "ఓ టి టి" లో కూడా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా తాజాగా జెమినీ సంస్థ వారు ఈ సినిమాను వచ్చే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీ లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ  మేరకు అలరిస్తుందో చూడాలి. ఇకపోతే నాని ప్రస్తుతం శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందుతున్న హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మ్రోణాల్ ఠాకూర్ , నాని కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: