
దాదాపుగా రూ .8 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ .10 కోట్ల కలెక్షన్స్ అందుకొని హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. ఈ సినిమా ఎటువంటి హడావిడి లేకుండా తాజాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రిమింగ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటి లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే తమిళ వర్షన్ కు వచ్చే వారం నుండి ఆహా లో ఈ సినిమా అందుబాటులో ఉండబోతుందని సమాచారం.
తెలుగులో మంచి పాపులారిటీ అందుకున్న బెదురులంక సినిమా..2012 యుగాంతం రాబోతోంది అంటూ ఒక రూమర్ క్రియేట్ చేసి అప్పటిలో ప్రపంచమంతటా మారుమోగిన విషయాన్ని అందరికీ తెలియజేసే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులోని ప్రతి యాక్టర్ కూడా తమ కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. కార్తికేయ నేహ జంటగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అలాగే అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తదితరులు సైతం ఇందులో నటించారు. ఈ సినిమాలోని ప్రతి ఒక్కరి కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు.