
నాగార్జున హీరోగా వచ్చిన నిన్నే ప్రేమిస్తా సినిమాకి మొదట రైటర్ గా పనిచేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక ఆ తర్వాత తరుణ్ హీరోగా విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వే కావాలని సినిమాకు కూడా డైలాగులు రాశారు. ఇక త్రివిక్రమ్ రాసిన డైలాగులు అన్నీ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయ్. ఇలా రైటర్ గా కెరియర్ పిక్స్ లో ఉన్న సమయంలోనే తరుణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఇక ఆ తర్వాత మహేష్ బాబుతో తీసిన అతడు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఇక తర్వాత పవన్ కళ్యాణ్ తో తీసిన జల్సా సూపర్ హిట్ అవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది. అయితే త్రివిక్రమ్ డైలాగులు బాగా రాయగలడు. దర్శకత్వంతో అదరగొట్టగలడు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ త్రివిక్రమ్ ఒక సినిమాకి పాటలు రాసాడట. ఇక అదే త్రివిక్రమ్ కు పాటలు రాయడంలో మొదటి, చివరి సినిమా అయ్యిందట. అదేదో కాదు రవితేజ, నమిత హీరో హీరోయిన్లుగా వచ్చిన ఒక రాజు ఒక రాణి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా హీట్ అవ్వలేదు. దీంతో త్రివిక్రమ్ కూడా పాటలు రాయడం కోసం మళ్ళీ ప్రయత్నించలేదు.