తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు. ఈయన రాజా రాణి సినిమాతో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇకపోతే ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు తలపతి విజయ్ తో వరుసగా తేరి , మెర్సల్ , బిగిల్ అనే మూడు సినిమాలను తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాలు కూడా అదిరిపోయే రేంజ్ కమర్షియల్ విజయాలను అందుకున్నాయి.

ఈ మూడు సినిమాలతో ఈ దర్శకుడు కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ దర్శకుడుగా ఎదిగాడు. ఇకపోతే ఈయన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ తో జవాన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ సినిమాకు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వరల్డ్ వైడ్ గా దక్కుతున్నాయి. ఈ మూవీ తో ఈ దర్శకుడి క్రేజ్ ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మూవీ తర్వాత ఈయన బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ... కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ తో ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ ని రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ... అందులో భాగంగా ప్రస్తుతం ఈ దర్శకుడు ఓ అదిరిపోయే కథను కూడా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అట్లీ ... షారుక్ , విజయ్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీ స్టారర్ మూవీ ని రూపొందించే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: