కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ లో వరుణ్ డాక్టర్ డాన్ వంటి సినిమాలు తో భారీ విజయాన్ని అందుకుని వి అజిత్  హీరోల తర్వాత స్థానంలో నిలిచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఇదే స్థాయిలో తెలుగులో సైతం క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో.  'రెమో', డాక్టర్', 'డాన్' వంటి సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్స్ గా నిలిచాయి. రీసెంట్ గా వచ్చిన 'మహావీరుడు' సినిమా కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. అలా కోలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న ఈ హీరో ప్రస్తుతం 'అయాలాన్'(తెలుగులో ఏలియన్) అనే సైన్స్ ఫిక్షన్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో ఓ ప్రాజెక్టుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు మరో అగ్ర దర్శకుడితో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు ఏ ఆర్ మురుగదాస్. శివ కార్తికేయన్ తన తదుపరిచిత్రం ఏ.ఆర్ మురుగదాస్ డైరెక్షన్లో ఉండనున్నట్లు స్వయంగా తెలిపాడు. ఈరోజు(సెప్టెంబర్ 25) మురగదాస్ పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం ఆయన్ని స్వయంగా కలిసి విషెస్ తెలిపారు శివ కార్తికేయన్. ఈ మేరకు తన సోషల్ మీడియాలో .." డియర్ సార్. హ్యాపీ బర్త్ డే, నా 23వ ప్రాజెక్టు కోసం మీతో కలిసి వర్క్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు చెప్పిన కథ విన్నాక నా ఆనందం రెట్టింపు అయింది. 

అన్ని విధాలుగా ఈ సినిమా నాకు ప్రత్యేకం కాబోతోంది. షూటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంటూ రాస్కొచ్చారు. అంతేకాకుండా మురగదాస్ తో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. దీంతో శివ కార్తికేయన్ చేసిన ఈ పోస్ట్    నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్లో 'గజిని', 'తుపాకీ', 'కత్తి' లాంటి ఇండస్ట్రీ హిట్స్ అందించిన మురగదాస్ లాంటి అగ్ర దర్శకుడుతో శివ కార్తికేయన్ సినిమా చేస్తున్నారనే విషయం తెలిసి ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మురగదాస్ విషయానికి వస్తే.. 2020లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో 'దర్బార్' అనే సినిమాని తెరకెక్కించారు. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఇప్పటివరకు మరే చిత్రానికి దర్శకత్వం వహించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: